తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

Tamil Superstar Rajinikanth Generous Towards Kalaijnanam - Sakshi

తొలి చిత్ర నిర్మాతకు రూ.45 లక్షలతో ఇల్లు కొనిచ్చిన వైనం

సాక్షి, చెన్నై: ‘చెప్పింది చేస్తా.. చేసేదే చెబుతా’ అంటూ సినిమా తెర మీద తనదైన శైలి డైలాగులతో ప్రేక్షకుల మన్ననలందుకున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నిజ జీవితంలోనూ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోలో హీరోగా తన తొలి చిత్రం ‘ౖభైరవి’ని నిర్మిం చిన నిర్మాత కలైజ్ఞానంకు చెన్నైలో రూ.45 లక్షలతో ఇల్లు కొనిపెట్టి మంచి మనసును చాటుకున్నారు. అంతేకాకుండా సోమవారం గృహప్రవేశానికి కూడా హాజరై ఆయనను అబ్బురపరిచారు. ఒకప్పుడు నిర్మాతగా కళ కళలాడిన కలైజ్ఞానం ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేక పోవడంతో విరుగంబాక్కంలో రూ.45 లక్షలతో కొనుగోలు చేసి ఇచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top