గుండెపోటుతో యువ న‌టుడు మృతి | Tamil actor Sethuraman Dies Due To Massive Cardiac Arrest | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో తమిళ న‌టుడు కన్నుమూత

Mar 27 2020 11:41 AM | Updated on Mar 27 2020 11:47 AM

Tamil actor Sethuraman Dies Due To Massive Cardiac Arrest - Sakshi

చెన్నై : త‌మిళ యువ న‌టుడు సేతురామ‌న్ (36) క‌న్నుమూశారు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురైంది. కాగా సేతురామ‌న్ న‌టుడే కాక వృత్తిరిత్యా చ‌ర్మ వ్యాధి నిపుణుడు కూడా. చెన్నైలో స్వ‌త‌హాగా జీ క్లినిక్‌ను (స్కిన్ కేర్‌) ఏర్పాటు చేసుకొని వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. సేతురామ‌న్‌కు భార్య ఉమ‌యాల్, ఏడాది వ‌య‌స్సున్న కూతురు ఉన్నారు. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు.

2013 లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. డైరెక్ట‌ర్‌ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత‌రం వాలిబా రాజా, సక్కా పోడు పోడు రాజా అండ్‌ 50/50.. వంటి చిత్రాల్లో నటించి మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా సేతురామ‌న్‌ మరణం పట్ల అనేక మంది నటులు, దర్శకులు తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఖుష్బు, నిర్మాత వెంకట్ ప్రభు, ధనంజయన్ తదితరులు సేతురామ‌న్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ట్విట‌ర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇక సేతురామ‌న్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు(శుక్ర‌వారం) జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement