జనతా గ్యారేజ్లో మిల్కీబ్యూటీ | tamannah special song in ntr janatha garage | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్లో మిల్కీబ్యూటీ

Apr 19 2016 12:06 PM | Updated on Sep 3 2017 10:16 PM

జనతా గ్యారేజ్లో మిల్కీబ్యూటీ

జనతా గ్యారేజ్లో మిల్కీబ్యూటీ

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్తో ఆకట్టుకుంటున్నారు చిత్రయూనిట్. తెలుగుతో పాటు పరభాషా నటులను కూడా తీసుకొని సినిమా మార్కెట్ను భారీగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
 
ఇప్పుడు ఈ భారీచిత్రం కోసం మరో గ్లామర్ ఎట్రాక్షన్ను యాడ్ చేస్తున్నారట. బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న తమన్నా.. జూనియర్  ఎన్టీఆర్ కోసం ఓ ఐటమ్ సాంగ్లో నటించడానికి అంగీకరించింది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ, మరోసారి ఎన్టీఆర్తో కలిసి స్పెషల్ సాంగ్లో చిందేయనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు ఉపయోగపడని తమన్నా గ్లామర్ ఎన్టీఆర్కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement