పరిస్థితులు అలా మార్చాయి: తాప్సీ

Taapsee Pannu Shares Her Saree Photo With a Brave Message - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను ఇటీవల నటించిన ‘థప్పడ్‌’ సినిమా విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని.. అమృత పాత్రలో ఒదిగి అందరిని ఆకర్షించారంటూ తాప్సీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు. ఇక తాజాగా తాప్సీ చీరలో ఉన్న ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోకి ‘నేను ధైర్యంగా ఉన్నాను.. ఎందుకంటే చీకటిని జయించాను. నేను నిరాడంబరంగా ఉన్నాను.. ఎందుకంటే.. నేను నిరాశను ఎదుర్కొన్నాను.  బలవంతురాలిని.. ఎందుకంటే పరిస్థితులు నన్ను అలా మార్చాయి. కృతజ్ఞతతో ఉన్నాను ఎందుకంటే నష్టాన్ని తెలుసుకున్నాను. ఇక నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అంటూ స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.(భారత సినీ చరిత్రలో ‘థప్పడ్‌’ మైలురాయి)

కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు!
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. షేర్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 4 లక్షల లైక్స్‌ రాగా వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇక తాప్సీ పోస్టు చూసిన నెటిజన్లు బాలీవుడ్‌ నటినటులు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. తాప్సీ తాజా చిత్రం ‘థప్పడ్‌’ దర్శకుడు అనుభవ్‌ సిన్హా..‘నువ్వు స్మార్ట్‌ అయ్యావు తాప్సీ’ అంటూ కామెంటు చేశాడు. ఆయనతో పాటు తాప్సీ ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ సహ నటి భూమి ఫెడ్నేకర్‌.. ‘సుందరి’ అంటూ హర్ట్‌ ఎమోజీనీ జత చేశారు. ఇక నటుడు విక్రాంత్‌ మెస్సీ కూడా ‘మేరీ రాణీ’ అంటూ కామెంటు చేశాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top