కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు! | Sakshi
Sakshi News home page

అది సహించరాని విషయం: స్మృతీ ఇరానీ

Published Mon, Feb 10 2020 5:52 PM

Smriti Irani Reacts To Taapsee Pannu Thappad Trailer - Sakshi

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ హీరోయిన్‌ తాప్సీ పన్ను తాజా చిత్రం ‘థప్పడ్‌’పై స్పందించారు. ఏదేమైనా మహిళపై చేయి చేసుకోవడం సరికాదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..‘ప్రతి విషయంలో మహిళలే సర్దుకుపోవాలని పెద్దలు చెప్పే మాటను మీలో ఎంతమంది విని ఉంటారు. కేవలం పేద మహిళలు మాత్రమే తమ భర్తలను కొడుతారని మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారు. చదువుకున్న పురుషులు ఆడవాళ్లపైకి చేయి ఎత్తరని ఎంతమంది నమ్ముతారు. ఇదేం పెద్ద విషయం కాదు.. ఇలాంటివి ఎన్నో మాకూ జరిగిగాయి మేము సంతోషంగా ఉండటం లేదా?.. జీవితమంటే సర్దుకుపోవాలి.. ఇలా ఎంతమంది తమ ఆడపిల్లలకు, కోడళ్లకు చెప్పుంటారు’ అంటూ రాసుకొచ్చారు.

అయితే ‘నేను ఓ రాజకీయ నాయకురాలిగా దర్శకుడి భావాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. అలాగే కొన్ని విషయాలపట్ల నటీనటులతో విభేదించకపోవచ్చు. కానీ ఓ మహిళగా నేను ఈ సినిమాను చూడాలనుకుంటున్నాను’ అని అన్నారు. అదేవిధంగా అందరూ తమ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కానీ ఒక్కమాట మహిళను కొట్టడం ఎంతమాత్రం కూడా సహించని విషయం.. అది ఒక చెంప దెబ్బ అయినా కూడా అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కాగా థప్పడ్‌ సినిమా  ఫిబ్రవరి 28న విడుదల కానుంది.

(చదవండి: వేరే సంబంధాలు ఉన్నాయా.. థప్పడ్‌ ట్రైలర్‌ కోసం క్లిక్‌ చేయండి!)

భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!

Advertisement
Advertisement