‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’

Javed Akhtar Said Thappad Became Milestone In Indian Cinema - Sakshi

అనుభవ సిన్హా దర్శకత్వంలో హీరోయిన్‌ తాప్సీ పన్ను నటించిన ‘థప్పడ్‌’ చిత్రం ఈనెల 28న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలైనప్పటీ నుంచి బాలీవుడ్‌ ప్రముఖులు దర్శకుడు అనుభవ్‌ సిన్హా, తాప్సీలపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా చూసిన ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ ‘థప్పడ్‌’ను ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ రోజు నేను సామాజిక అంశాల పట్ల సున్నితమైన భావాలను చూపించిన ‘థప్పడ్‌’ చూశాను. భారత సినీ చరిత్రలో ఈ సినిమాను ఓ మైలు రాయిగా చెప్పుకోవచ్చు. ఇంతటి విజయాన్ని సాధించిన దర్శకుడికి, నటీనటులకు నా అభినందనలు’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

తొలితాప్సీ అనొచ్చు కదా

నటుడు ఆయుష్మాన్‌ ఖురానా భార్య తాహీర్‌ కశ్యప్‌ కూడా ఈ సినిమాను, తాప్సీని ప్రశంసించారు. ‘థప్పడ్‌ అద్బుతమైన చిత్రం. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలన్నింటిలో ‘థప్పడ్‌’ ప్రత్యేకమైనది. ఈ సినిమా చూసిన అన్ని రకాల ప్రేక్షకులకు ‘థప్పడ్‌’ కథ ఉద్దేశమెంటో అర్థమవుతుంది. తాప్సీ గృహిణిగా అమృత పాత్రలో ఒదిగిపోయారు. ఆమె నటన నన్ను ఆకట్టుకుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో  అమృత(తాప్సీ) భర్తగా పావైల్ గులాటి నటించారు. కాగా దియా మీర్జా, రత్న పాథక్ షా, కుముద్ మిశ్రా, తన్వి అజ్మీలు ప్రముఖ పాత్రల్లో కనిపించారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top