తొలితాప్సీ అనొచ్చు కదా | Taapsee was called female Ayushmann Khurrana | Sakshi
Sakshi News home page

తొలితాప్సీ అనొచ్చు కదా

Feb 17 2020 5:40 AM | Updated on Feb 17 2020 5:40 AM

Taapsee was called female Ayushmann Khurrana - Sakshi

తాప్సీ

ఏదైనా రంగంలో రాణించినప్పుడు అందులో బాగా రాణిస్తున్నవారితో పోలుస్తుంటారు. తాప్సీ మాత్రం పోలిక ఎందుకు? అంటున్నారు. ఎవరితోనో పోల్చకుండా వాళ్ల గుర్తింపు వాళ్లకే ఇవ్వొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారామె. ప్రస్తుతం బాలీవుడ్‌లో తాప్సీ విభిన్నమైన స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ అవార్డు వేడుకలో ‘సాంద్‌కీ ఆంఖ్‌’ సినిమాకు అవార్డు గెలుచుకున్నారామె. ఈ సందర్భంగా తాప్సీని అభినందిస్తూ ‘బాలీవుడ్‌ ఫీమేల్‌ ఆయుష్మాన్‌ ఖురానా’ అని ట్వీటర్‌లో సంబోధించారు. ‘‘అలా అనేకంటే బాలీవుడ్‌ తొలి తాప్సీ అని పిలవొచ్చు కదా?’’ అని రిప్లై ఇచ్చారు తాప్సీ. ఆ సమాధానానికి సోషల్‌ మీడి యాలో ప్రశంసలు అందుకుంటున్నారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement