పొల్లాచ్చిలో ‘సై రా’ సెకండ్ షెడ్యూల్ | Sye raa Second Schedule Updates | Sakshi
Sakshi News home page

Jan 5 2018 11:44 AM | Updated on Jan 5 2018 11:44 AM

ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది.

ఇది సమయంలో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించటం, సినిమా యూనిట్ నుంచి పలువురు సాంకేతిక నిపుణులు తప్పుకున్నారంటూ వార్తలు రావటంతో సై రా ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ సై రా టీం నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో సై రా రెండో షెడ్యూల్‌ షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement