స్వామి రారాకి సెకండ్ పార్ట్ | Swamy Ra Ra to have a sequel | Sakshi
Sakshi News home page

స్వామి రారాకి సెకండ్ పార్ట్

May 1 2014 11:21 PM | Updated on Sep 2 2017 6:47 AM

గత ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించి, ‘పెద్ద సినిమా’గా నిలిచినవాటిలో ‘స్వామి రారా’ ఒకటి. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన

 గత ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించి, ‘పెద్ద సినిమా’గా నిలిచినవాటిలో ‘స్వామి రారా’ ఒకటి. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత చక్రి చిగురుపాటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నారు. దీనికి ‘స్వామి స్వామి రారా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ది సాగా కంటిన్యూస్’ అనేది ఉపశీర్షిక. ఎన్. బోస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్తదనానికి నిర్వచ నంగా నిలిచిన ‘స్వామిరారా’కి సీక్వెల్ చేస్తున్నాం. ఓ ప్రముఖ కథా నాయకునితో, భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా నిర్మించను న్నాం’’ అని చెప్పారు. దీనికి సహ నిర్మాత: బీఎస్ వర్మ.
 

Advertisement
 
Advertisement
Advertisement