డిసెంబర్‌లో రెండు దేశాలు | Sunil Two Countries Teaser Launched By Pawan Kalyan | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో రెండు దేశాలు

Nov 25 2017 12:26 AM | Updated on Mar 22 2019 5:29 PM

Sunil Two Countries Teaser Launched By Pawan Kalyan - Sakshi

సునీల్‌ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఎన్‌. శంకర్‌ నిర్మించిన చిత్రం ‘2 కంట్రీస్‌’. మనీషా రాజ్‌ కథానాయిక. మలయాళ సినిమా ‘2 కంట్రీస్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. ఈ సినిమా టీజర్‌ను హీరో పవన్‌ కల్యాణ్‌ లాంచ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్‌ను నా చేతుల మీదుగా లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘టీజర్‌ను లాంచ్‌ చేయడమే కాకుండా, బాగుందని మెచ్చుకున్న పవన్‌ కల్యాణ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు సునీల్‌. ‘‘టీజర్‌ను ఆవిష్కరించిన పవన్‌కల్యాణ్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎన్‌. శంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement