అఖిల్‌ చిన్న పిల్లాడన్న సుధీర్‌ | Sudheer Babu Intresting Comment on Akhil Akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్‌ చిన్న పిల్లాడన్న సుధీర్‌

Feb 27 2019 11:01 AM | Updated on Feb 27 2019 12:43 PM

Sudheer Babu Intresting Comment on Akhil Akkineni - Sakshi

ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సరైన కథ దొరికితే మల్టీస్టారర్‌ సినిమాలకు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌) కారణంగా హీరో మధ్య స్నేహం మరింత బలపడుతుంది. ఈ రోజు నుంచి సీసీఎల్‌ సిరీస్‌ ప్రారంభమవుతున్న సందర్భంగా హీరో సుధీర్‌ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు.

తెలుగు వారియర్స్‌ టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అఖిల్‌ ఓ చిన్న పిల్లాడితో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన హీరో సుధీర్‌ బాబు.. ‘ఓ పిల్లాడు మరో పిల్లాడికి గేమ్‌ ప్లాన్‌, స్ట్రాటజీలో సాయం చేస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సీసీఎల్‌ మ్యాచ్‌లలో తెలుగు, హిందీ, బెంగాళీ, పంజాబీ, కన్నడ, భోజ్‌పూరి ఇండస్ట్రీలకు చెందిన ఆరు టీంలు తలపడనున్నాయి.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement