breaking news
CCL Tourney
-
అఖిల్ చిన్న పిల్లాడన్న సుధీర్
ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సరైన కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కారణంగా హీరో మధ్య స్నేహం మరింత బలపడుతుంది. ఈ రోజు నుంచి సీసీఎల్ సిరీస్ ప్రారంభమవుతున్న సందర్భంగా హీరో సుధీర్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు. తెలుగు వారియర్స్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అఖిల్ ఓ చిన్న పిల్లాడితో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన హీరో సుధీర్ బాబు.. ‘ఓ పిల్లాడు మరో పిల్లాడికి గేమ్ ప్లాన్, స్ట్రాటజీలో సాయం చేస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సీసీఎల్ మ్యాచ్‌లలో తెలుగు, హిందీ, బెంగాళీ, పంజాబీ, కన్నడ, భోజ్‌పూరి ఇండస్ట్రీలకు చెందిన ఆరు టీంలు తలపడనున్నాయి. One kid is helping the other in game plan and strategy 🤣 #CCL @AkhilAkkineni8 pic.twitter.com/uKb2aVXjXl — Sudheer Babu (@isudheerbabu) 27 February 2019 -
దుమ్మురేపిన తెలుగు వారియర్స్
కటక్: సీసీఎల్ టోర్నీ మరోసారి అభిమానులకు టి-20 మజా అందించింది. శనివారం రాత్రి కటక్‌లో జరిగిన పోటీలకు అభిమానులు పోటెత్తారు. టాలీవుడ్ నటుల జట్టు తెలుగు వారియర్స్ దుమ్మురేపింది. భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది. భోజ్‌పురి దబాంగ్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ రెండు వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.