రియల్‌ మ్యాన్‌ | SS Rajamouli accepts Sandeep Wanga challenge | Sakshi
Sakshi News home page

రియల్‌ మ్యాన్‌

Apr 21 2020 4:55 AM | Updated on Apr 21 2020 4:55 AM

SS Rajamouli accepts Sandeep Wanga challenge - Sakshi

రమ, రాజమౌళి, సందీప్‌ వంగ

‘‘భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేయడానికి  భర్తను మించినవాళ్లు ఉండరు. నిజమైన భర్త తన భార్య ఇంటెడు చాకిరీతో కష్టపడుతుంటే చూస్తూ కూర్చోడు. మరీ ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో’’ అంటున్నారు ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ వంగ. ఇంట్లో భార్యకు సహాయం చేయండి అని చెబుతున్నారు. తాను గిన్నెలు శుభ్రం చేయడం, ఇల్లు తుడవడం వంటి ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్వీటర్‌లో  షేర్‌ చేసి  ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ అని ఛాలెంజ్‌ విసిరారు. ఈ ఛాలెంజ్‌కి దర్శకుడు రాజమౌళిని నామినేట్‌ చేశారు సందీప్‌. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించి, రాజమౌళి కూడా ఇంటి ఫ్లోర్‌ తుడుస్తూ, కిటికీల దుమ్ము దులుపుతూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్న వీడియోను ట్వీటర్‌లో పంచుకున్నారు. ఆ వీడియో షేర్‌ చేస్తూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్, ‘బాహుబలి’ నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు కీరవాణికి ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ విసిరారు. ఛాలెంజ్‌ స్వీకరిస్తున్నట్టు ఆల్రెడీ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement