నిర్మాతగా సౌందర్యా రజనీకాంత్‌

Soundarya Rajinikanth To Produce Ponniyin Selvan Webseries - Sakshi

కల్కి కృష్ణమూర్తి రచించిన తమిళ చారిత్రాత్మక నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని చాలామంది దర్శక–నిర్మాతలు కలలు కంటుంటారు. వారిలో  దర్శకుడు మణిరత్నం పేరు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా తీసే పనిలోనే ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్‌ కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ ‘కొచ్చాడియన్‌’ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన ఎస్‌. సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తారు. ‘‘ఈ నవలకు  దృశ్యరూపం ఇవ్వాలని చదివినప్పుడే అనిపించింది’’ అని పేర్కొన్నారు సౌందర్య.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top