ఒక్క పాటకు అరవై లక్షలు! | Sixty hundred thousand in a single song! | Sakshi
Sakshi News home page

ఒక్క పాటకు అరవై లక్షలు!

Sep 30 2013 2:33 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఒక్క పాటకు అరవై లక్షలు! - Sakshi

ఒక్క పాటకు అరవై లక్షలు!

సంచలన వ్యాఖ్యలు చేసి, వివాదాలకు గురవ్వడం పూనమ్ పాండేకి అలవాటు. నిర్మొహమాటంగా మాట్లాడే పూనమ్ దుస్తుల విషయంలో కూడా ఎలాంటి మొహమాటాలు పాటించదు. చాలా పొదుపుగా వాడుతుంటుంది. ‘నషా’ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ విషయంలో ఈ హాట్‌గాళ్ హద్దులు దాటేసింది.

 ఇప్పుడు దక్షిణాది తెరపై విజృంభించడానికి రెడీ అయ్యింది. కన్నడ చిత్రం ‘లవ్ ఈజ్ పాయిజన్’లో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది పూనమ్. మరో నాలుగైదు రోజుల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. 
 
 మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణకు పూనమ్ తీసుకుంటున్న పారితోషికం 60 లక్షలని సమాచారం. ఇప్పటికే శాండిల్‌వుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యిందట. ఎందుకంటే, అక్కడ స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం అరకోటి లోపేనట. అలాంటిది ఒక్క పాటకు అరవై లక్షలా? అని చర్చించుకుంటున్నారని వినికిడి. 
 
Advertisement
 
Advertisement
Advertisement