breaking news
Nasha
-
ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు
సంచలన తార పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘నషా’, తెలుగులో ‘తేరా నషా’గా అనువాదమవుతోంది. నిర్మాత ఈవీఎన్ చారి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘జిస్మ్’ ఫేమ్ అమిత్ సక్సేనా ఈ సినిమాకు దర్శకుడు. ఈవీఎన్ చారి మాట్లాడుతూ -‘‘ఈ తరహా కథాంశాన్ని ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. పూనమ్ పాండే తన అందచందాల్ని ఆవిష్కరించడంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సంగీత్-సిద్దార్థ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హిందీలో విజయం సాధించినట్టుగానే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం’’ అని చెప్పారు. -
ఒక్క పాటకు అరవై లక్షలు!
సంచలన వ్యాఖ్యలు చేసి, వివాదాలకు గురవ్వడం పూనమ్ పాండేకి అలవాటు. నిర్మొహమాటంగా మాట్లాడే పూనమ్ దుస్తుల విషయంలో కూడా ఎలాంటి మొహమాటాలు పాటించదు. చాలా పొదుపుగా వాడుతుంటుంది. ‘నషా’ చిత్రంలో ఎక్స్పోజింగ్ విషయంలో ఈ హాట్గాళ్ హద్దులు దాటేసింది. ఇప్పుడు దక్షిణాది తెరపై విజృంభించడానికి రెడీ అయ్యింది. కన్నడ చిత్రం ‘లవ్ ఈజ్ పాయిజన్’లో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది పూనమ్. మరో నాలుగైదు రోజుల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణకు పూనమ్ తీసుకుంటున్న పారితోషికం 60 లక్షలని సమాచారం. ఇప్పటికే శాండిల్వుడ్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యిందట. ఎందుకంటే, అక్కడ స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం అరకోటి లోపేనట. అలాంటిది ఒక్క పాటకు అరవై లక్షలా? అని చర్చించుకుంటున్నారని వినికిడి. -
హైదరాబాద్ లో ఫూనమ్ పాండే