నరసింహస్వామి వైభవం | simhanadam movie logo launch | Sakshi
Sakshi News home page

నరసింహస్వామి వైభవం

Jan 24 2019 12:34 AM | Updated on Jan 24 2019 12:34 AM

simhanadam movie logo launch - Sakshi

పి. శ్రీనివాస్, కామిశెట్టి శ్రీనివాసులు, సింహయాజి స్వామీజీ, బెక్కెం వేణుగోపాల్‌

సుమన్‌ ప్రధాన పాత్రలో పి.శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భక్తిరస ప్రధాన చిత్రం ‘సింహనాదం’.  (శ్రీ నరసింహస్వామి వారి వైభవం). శ్రీ లిఖిత మూవీ మేకర్స్, శ్రీ వైష్ణవ స్పిరిటైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు స్వామిజీల ఆశీస్సులతో ఈ చిత్రం టైటిల్‌ లోగోను కూడా ఆవిష్కరించారు. శ్రీనరసింహస్వామి వైభవాన్ని చాటి చెబుతూ రూపొందుతున్న ‘సింహనాదం’ సినిమా ఘన విజయం సాధించాలని స్వామీజీలు ఆశీర్వదించారు. ‘‘సుమన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుపుతున్నాం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టనున్నాం’’ అని పి. శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిల నరసింహస్వామిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనలతో కూడిన ‘సర్వం సింహమయం’ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవంలో సింహయాజి స్వామి, కామిశెట్టి శ్రీనివాస్, రామానుజాచార్యులు, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, బీజేపీ నాయకురాలు గీతామూర్తి,  నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ (గోపి) తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణి–దిలీప్, సంగీతం: విజయ్‌ కురాకుల.

Advertisement
 
Advertisement
Advertisement