భారతీయుడితో శింబు, దుల్కర్‌..!

Simbu And Dulquer Salmaan Joins The Cast of Indian 2 - Sakshi

లోక నాయకుడు కమల్ హాసన్‌, క్రియేటివ్‌ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్ సినిమా భారతీయుడు. ఇండియన్ పేరుతో హిందీలోనూ  సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత శంకర్‌, కమల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్‌ కాస్టింగ్‌ను రెడీ చేస్తున్నాడు శంకర్‌. ఇప్పటికే కమల్‌ తో పాటు హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమాలో కమల్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్‌ హీరో శింబుతో పాటు నయా సెన్సేషన్‌ దుల్కర్‌ సల్మాన్‌ కూడా నటించనున్నాడట.

ప్రస్తుతానికి శింబు, దుల్కర్‌ పాత్రలపై అధికారిక ప్రకటన రాకపోయినా భారతీయుడు 2లో ఈ స్టార్స్‌ కనిపించటం దాదాపుగా కన్ఫామ్‌ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలకు బాలీవుడు స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ను సంప్రదిస్తున్నారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top