కత్రినా ఏం చేసిందో చూడండీ! | Sidharth posts Katrina pic while she is sleeping | Sakshi
Sakshi News home page

కత్రినా ఏం చేసిందో చూడండీ!

Sep 3 2016 11:31 AM | Updated on Sep 4 2017 12:09 PM

కత్రినా ఏం చేసిందో చూడండీ!

కత్రినా ఏం చేసిందో చూడండీ!

బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో' ప్రమోషన్లలో మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది.

బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో' ప్రమోషన్లలో మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది. నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం కొన్ని రోజులు చాలా కష్టపడ్డాం అని చెప్పిన హీరో సిద్ధార్థ్.. కత్రినాతో కలసి మూవీ ప్రమోషన్ కోసం ఇండోర్ వెళ్లాడు. బిజీబిజీ షూటింగ్ షెడ్యూల్స్, ఆ వెంటనే ప్రమోషన్ల కోసం జర్నీ చేయడంతో ముద్దుగుమ్మ కత్రినా కాస్త అలసటగా ఫీలైంది. దీంతో వాళ్లు ట్రావెల్ చేస్తున్న వాహనంలో కూర్చుని కత్రినా అలాగే కాస్త కునుకు తీసింది.

వెంటనే సిద్ధార్థ్ ఆ దృశ్యాన్ని ఫొటో తీశాడు. కత్రినాలాగ ఎవరైనా నిద్రపోగలరా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దాంతో పాటు కొన్ని డ్యాన్స్ సీన్లను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ మూవీకి విపరీతమైన ప్రచారం లభించింది. కత్రినా అలా నిద్రించడానికి కారణాలు పోస్ట్ లో పేర్కొన్నాడు. కోల్ కతా, జైపూర్లలో మెట్రో రైళ్లలో, ట్రామ్ వాహనాలలో డ్యాన్స్ చేయడంతో అలసటకు గురైన కత్రినా కాస్త విశ్రాంతి కోరుకుందని వివరించాడు. సిద్ధార్థ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement