థ్రిల్‌ ఫుల్‌ | Shalini movie release on September 1 | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ ఫుల్‌

Aug 22 2017 12:57 AM | Updated on Sep 17 2017 5:48 PM

థ్రిల్‌ ఫుల్‌

థ్రిల్‌ ఫుల్‌

అమోఘ్‌ దేశపతి, అర్చన, శ్రేయావ్యాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’.

అమోఘ్‌ దేశపతి, అర్చన, శ్రేయావ్యాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. షెరాజ్‌ దర్శకత్వంలో సాయి వెంకట్‌ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. షెరాజ్‌ మాట్లాడుతూ– ‘‘సత్యనారాయణతో నాకిది రెండో సినిమా. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పారు. ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. హారర్‌ ఇష్టపడే వారికి తప్పకుండా మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సెప్టెంబర్‌ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అని అమోఘ్‌ దేశపతి అన్నారు. ‘‘ఈ చిత్రానికి ప్రధాన కేంద్రాల్లో థియేటర్లు ఇప్పిస్తా’’ అన్నారు ఆర్‌.కె. గౌడ్‌.

Advertisement
 
Advertisement
Advertisement