breaking news
amog deshapathi
-
హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేతా వర్మ, అమోఘ్ దేశపతి, మోహన్, నితిన్నాశ్, తనూజ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సంజీవని’. రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించిన అబ్బురపరిచే దృశ్యాల్ని ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో చూపించాం. సినిమా చూసినవారంతా హాలీవుడ్ స్థాయిలో తీశారని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. 87 థియేటర్లలో విడుదలైన మా సినిమా ప్రస్తుతం 100కి పైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్ల పెంపే మా విజయానికి నిదర్శనం. మా చిత్రం ఓపెనింగ్ ఎపిసోడ్‌ని ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తోంది. మూడు రోజుల్లో 1.25కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నివాస్. -
థ్రిల్ ఫుల్
అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. షెరాజ్ దర్శకత్వంలో సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. షెరాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యనారాయణతో నాకిది రెండో సినిమా. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పారు. ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. హారర్ ఇష్టపడే వారికి తప్పకుండా మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అని అమోఘ్ దేశపతి అన్నారు. ‘‘ఈ చిత్రానికి ప్రధాన కేంద్రాల్లో థియేటర్లు ఇప్పిస్తా’’ అన్నారు ఆర్.కె. గౌడ్.