breaking news
Shreya Vyas
-
థ్రిల్ ఫుల్
అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. షెరాజ్ దర్శకత్వంలో సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. షెరాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యనారాయణతో నాకిది రెండో సినిమా. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పారు. ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. హారర్ ఇష్టపడే వారికి తప్పకుండా మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అని అమోఘ్ దేశపతి అన్నారు. ‘‘ఈ చిత్రానికి ప్రధాన కేంద్రాల్లో థియేటర్లు ఇప్పిస్తా’’ అన్నారు ఆర్.కె. గౌడ్. -
క్షణ క్షణం ఉత్కంఠ
‘‘ఈ సినిమా పాటలు బాగున్నాయి. చిన్న సినిమాలు ఎక్కువగా రావాలి. అప్పుడే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. 2000 ఎకరాల్లో ప్రభుత్వం ఫిలిం సిటీ నిర్మించనుంది’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్ ముఖ్య పాత్రల్లో షెరాజ్ దర్శకత్వంలో పీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘షాలిని’. నవనీత్ చారీ స్వరపరచిన పాటల సీడీలను వేణుగోపాలాచారి విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ – ‘‘హారర్, థ్రిల్లర్, లవ్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా చూశాకా, విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. షేరాజ్తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు క్షణ క్షణం ఉత్కంఠ కలిగించే చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్, గోవాలో షూటింగ్ చేశాం’’ అన్నారు షెరాజ్. ఆర్కే గౌడ్, పీవీ సత్యనారాయణ, అమోఘ్ దేశపతి తదితరులు పాల్గొన్నారు.