శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..? | Sekhar Kammula to direct Allu Arjun? | Sakshi
Sakshi News home page

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..?

Jan 3 2015 11:08 PM | Updated on Sep 2 2017 7:10 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..?

దర్శకుడు శేఖర్ కమ్ములదో విలక్షణమైన శైలి. యువతను ఆకట్టుకునే విధంగా సెన్సిటివ్ సినిమాలూ తీయగలరు..

దర్శకుడు శేఖర్ కమ్ములదో విలక్షణమైన శైలి. యువతను ఆకట్టుకునే విధంగా సెన్సిటివ్ సినిమాలూ తీయగలరు.. ‘లీడర్’వంటి శక్తిమంతమైన సినిమానూ చేయగలరు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలతో శేఖర్ సినిమా చేయలేదు. ఈ ఏడాది అది జరగనుందని సమాచారం. ఇటీవల బన్నీ (అల్లు అర్జున్)కి శేఖర్ కమ్ముల ఓ స్టోరీలైన్ వినిపించారట. అది బన్నీకి బాగా నచ్చిందని భోగట్టా. ఈ చిత్రంలో నటించడానికి ఆయన సుముఖంగా ఉన్నారని తెలిసింది. దాంతో పూర్తి కథ తయారు చేయడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు మొదలుపెట్టారట.
 
  ప్రస్తుతం ‘హ్యపీ డేస్’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తో కలిసి శేఖర్ నిర్మించనున్నారు. అది పూర్తయిన తర్వాత బన్నీతో చేసే చిత్రం మొదలుపెడతారేమో. ఇది ఇలా ఉంటే బన్నీ మంచి మాస్ హీరో. ఇప్పటివరకు తను చేసిన తరహా మాస్ చిత్రాలను శేఖర్ కమ్ముల తీయలేదు. మరి.. బన్నీ తరహాలో మాస్ చిత్రం చేస్తారా? లేక తనదైన శైలిలో బన్నీని వేరే విధంగా ఆవిష్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement