20 ఏళ్ల క్రితమే అల్లు అర్జున్‌ సినిమా క్లైమాక్స్‌..!

Allu arjun, Aadi pinishetty Childhood Photo - Sakshi

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అల్లు వారబ్బాయి శిరీష్, తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశాడు. రెండు రోజుల క్రితం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నప్పటి తమ చిన్ననాటి ఫోటోను ట్వీట్‌చేసిన శిరీష్ ‘ఈ ఫొటోలో అల్లు అర్జున్‌, నేను కాకుండా మరో నటుడు ఉన్నాడు ఎవరో కనిపెట్టండి’ అంటూ ట‍్వీట్‌ చేశాడు. తాజాగా ఆ ఫొటోల ఉన్న మరో నటుడు ఎవరో రివీల్‌ చేశాడు శిరీష్‌. దాదాపు 20 ఏళ‍్ల క్రితం తీసిన ఈ ఫొటోలో ఉన్నమరో నటుడు ఆది పినిశెట్టి అని వెల్లడించాడు.

కుంగ్‌ఫూ తరగుల్లో అల్లు అర్జున్‌, ఆది పినిశెట్టి తలపడుతున్న ఫొటోలను ట్వీట్ చేసిన ‘దేవుడు 20 ఏళ్ల క్రితమే సరైనోడు సినిమా క్లైమాక్స్‌ ను డిజైన్‌ చేశాడని ఎవరికి తెలుసు..?’ అంటూ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌ గా నటించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా పరిచయం అయిన ఆది ప్రస్తుతం ప్రతినాయక పాత్రలతో పాటు సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ దూసుకుపోతున్నాడు.

Back to Top