Sanju 10 Days Box Office Collections | కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’ - Sakshi
Sakshi News home page

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’

Jul 9 2018 3:39 PM | Updated on Jul 9 2018 5:51 PM

Sanju Box Office Collections Day 10 - Sakshi

ముంబై: సంజయ్‌ దత్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. 

పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ర‌ణ్‌బీర్‌క‌పూర్ కెరీర్‌లోనే అత్యధిక క‌లెక్షన్లు సాధించిన చిత్రంగా నిల‌వ‌డం విశేషం. 

రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్‌ తదితరులు నటించారు. సంజయ్‌ దత్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement