త్వరలో సెట్స్‌ మీదకు 300 కోట్ల చిత్రం | Sangamithra To Go To Sets In July | Sakshi
Sakshi News home page

త్వరలో సెట్స్‌ మీదకు 300 కోట్ల భారీ చిత్రం

Apr 3 2018 1:19 PM | Updated on Apr 3 2018 2:18 PM

బాహుబలి రిలీజ్‌ తరువాత తమిళ సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి అదే స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర‍్మించేందుకు రెడీ అయ్యారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. జయం రవి, ఆర్యలు ప్రధాన పాత్రల్లో శృతిహాసన్‌ టైటిల్‌ రోల్‌లో సంఘమిత్ర సినిమాను ఎనౌన్స్‌ చేశారు. అయితే సినిమాను లాంఛనంగా ప్రారంభించిన కొద్ది రోజులకే శృతిహాసన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంది తప్పుకుంది. తరువాత మరో హీరోయిన్‌ను ప్రకటించకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్‌ వినిపించింది.

అయితే సుందర్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శృతిహాసన్‌ స్థానంలో బాలీవుడ్‌ నటి దిశాపటాని నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను షూటింగ్‌ను ప్రారభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. శ్రీ తేండాల్‌ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌కు సంబంధించి చిత్రయూనిట్‌ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement