తారలు దిగి వచ్చిన వేళ

sammohanam Taralu Digi Vachina Vela book release - Sakshi

‘సమ్మోహనం’  సినిమా చూసినవారందరికీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకం గుర్తుండే ఉంటుంది. సుధీర్‌ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని సినిమాలో హీరోయిన్‌ అదితీరావ్‌ రిలీజ్‌ చేస్తారు. ఇప్పుడీ ‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా రిలీజ్‌ చేయించారు చిత్రబృందం. సుధీర్‌ బాబు, అదితీరావ్‌ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సమ్మోహనం’.

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్‌ అయి హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పటానికి  చిరంజీవిని కలిశారు చిత్రబృందం. ఈ సందర్భంగా ‘తారలు దిగి వచ్చిన వేళ..’ బుక్‌ రిలీజ్‌ చేశారు చిరంజీవి. ‘‘సమ్మోహనం’ చిత్రం గుర్తుగా ఈ పుస్తకాన్ని మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తే బావుంటుందని భావించాం. ఈ కథల పుస్తకాన్ని పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top