సల్మాన్‌ తిట్లు.. సూసైడ్‌ అటెంప్ట్? | Salman lashes out Zubair Khan in Bigg Boss | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లో సల్మాన్‌ తిట్లు.. సూసైడ్‌ అటెంప్ట్?

Oct 8 2017 12:24 PM | Updated on Nov 6 2018 8:08 PM

Salman lashes out Zubair Khan in Bigg Boss - Sakshi

సాక్షి, సినిమా : హిందీ రియాల్టీ షో బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌ మొదలై వారం తిరగక ముందే వివాదాలు మొదలయ్యాయి. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో హౌజ్‌ మేట్స్ అందరిని హోస్ట్ సల్మాన్‌ ఖాన్‌ ఓ రేంజ్‌లో తిట్టి పడేశాడు. ముఖ్యంగా జుబెయిర్‌ ఖాన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, అతను ఆత‍్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌కు అల్లుడుగా చెప్పుకుంటున్న జుబెయిర్‌ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తన తోటి హౌజ్‌ మేట్స్‌ అయిన బందగీ కాల్రా, అర్షిఖాన్‌లను అసభ్య పదజాలంతో  దూషించటం సల్మాన్‌కు కోపం తెప్పించింది. తనను భాయ్‌ అని పిలవొద్దంటూ సల్మాన్‌ జుబెయిర్‌ పై ఓ రేంజ్‌లోనే ఫైర్‌ అయ్యాడు. నీ పిల్లలు నిన్ను బిగ్‌బాస్‌లో చూడాలని అనుకుంటున్నారు. కానీ, ఇక్కడ నీ ప్రవర్తనతో నీ వాళ్లకు చెడ్డ పేరు తెస్తున్నావ్‌ అంటూ మండిపడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన జుబెయిర్‌ అతిగా మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడంట. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ప్రమాదం తప్పిందని టైమ్స్ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది.

ఇక సల్మాన్‌ ఏ ఒక్కరినీ వదలకుండా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. హిటెన్‌ తేజ్వానీ మొదలుకుని హీనా ఖాన్‌ దాకా ఏ ఒక్కరినీ వదలకుండా విమర్శించాడు. వికాస్ గుప్తాపై రాపర్‌ ఆకాశ్ చేసిన సెక్సువల్ కామెంట్లపై కూడా సల్మాన్ క్లాస్ పీకాడు. వారానికే ఇలా ఉంటే.. బిగ్‌ బాస్‌-11లో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement