సల్మాన్ ఖాన్ విహార యాత్ర | Salman Khan enjoys river rafting amid Tubelight shoot in Manali | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ విహార యాత్ర

Sep 21 2016 8:22 PM | Updated on Sep 4 2017 2:24 PM

సల్మాన్ ఖాన్ విహార యాత్ర

సల్మాన్ ఖాన్ విహార యాత్ర

సినిమాలతోపాటు కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(50) ఒకరు.

కులుమనాలి: సినిమాలతోపాటు కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(50) ఒకరు.  ప్రస్తుతం దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘ట్యూబ్ లైట్’ సినిమా షూటింగ్ లో సల్మాన్‌ బిజీగా ఉన్నాడు. షూటింగ్ లో కాస్త విరామం దొరకగానే ఆయన కుటుంబంతో కలిసి బియాస్ నది అందాలను తిలకిస్తూ తెప్ప బోటులో రైసన్ గ్రామం నుంచి  కులుమనాలి టౌన్ వరకు దాదాపు 14 కి.మీ  గంటన్నర పాటు ప్రయాణించారు.

ఈ ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సల్మాన్  నటిస్తున్న ‘ట్యూబ్ లైట్’ సినిమా చైనా, భారత్ యుద్ధం ఇతివృత్తం ఆధారంగా  కబీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో చైనా నటి ఝు ఝు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో సల్మాన్‌ విలక్షణ పాత్రతో  ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ సినిమా 2017 లో విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement