శ్రీదేవిని గుర్తుపట్టలేకపోయిన సీనియర్‌ నటుడు

Rishi Kapoor Gets Trolled For Failing To Recognize His Co Star Sridevi In A Throwback Video! - Sakshi

రిషి కపూర్.. 1980ల్లో బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగొందిన హీరో. పలు సక్సస్‌ సినిమాలను తన సొంతం చేసుకోవడమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా, ఆర్‌కే ఫిల్మ్‌ యజమానిగా రాణిస్తున్నారు. అయితే ఈ ప్రముఖ నటుడు మరోసారి సోషల్‌ మీడియాలో ఇరకాటంలో పడ్డారు. ట్విటర్‌ యూజర్లు ఆయనపై విమర్శల మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయనపై ఇంతలా మండిపడటానికి కారణమేమిటో తెలుసా? అతిలోక సుందరి, అందాల తార అయిన శ్రీదేవిని తను గుర్తుపట్టలేకపోవడం. అంతేకాకుండా... తనతో పాటు స్టెపులేసిన ఆ నటి ఎవరో తనకు గుర్తుకు రావడం లేదు! ఆ సినిమా ఏమిటి అంటూ ట్విటర్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన వీడియోకు రిప్లై ఇవ్వడం. రిషి తన అభిమాని పోస్టు చేసిన ఓ పాత వీడియోకు ఈ ట్వీట్‌ చేశారు. 

ఈ వీడియోలో ఉన్న తన కోస్టార్‌ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నానంటూ.. అనడం నిజంగా అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. తనతో పాటు ఫేమస్‌ చాందినీ సినిమాలో జతకట్టిన శ్రీదేవిని ఆయన గుర్తించలేకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ అభిమానులు తీవ్ర కోపోద్రిక్తులవుతున్నారు. ఆయనపై పలు విమర్శనాత్మక ట్వీట్లు కూడా చేస్తున్నారు. 

రిషి కపూర్‌ చేసిన ఆ ట్వీట్‌కు యూజర్లు ఏ విధంగా స్పందిస్తున్నారో ఓ సారి మీరే చూడండి...
‘ఆమె ఎవరంటే.. నీకంటే బాగా డ్యాన్స్‌ చేసిన శ్రీదేవి’ అని, ‘నాగిన, చాందినీ సినిమాల్లో ఆమె మీతో పాటు నటించకపోతే, ఎవరూ మిమ్మల్ని గుర్తు పట్టేవారే కాదు’,  అని మరొకరు, ‘ అందుకే ఎక్కువగా ఆల్కహాల్‌ తీసుకోవడం, మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు’, అని మరో ట్విటర్‌ యూజర్‌, ‘అతని తలంతా ఇగో అనే గ్యాస్‌తో నిండి ఉంది. అందుకే జ్ఞాపకశక్తి కోల్పోయారు. ఆ కారణంతో ఆయన కో-స్టార్‌ను గుర్తుపట్టలేకపోతున్నారు’  అంటూ మరో యూజర్‌ ఇలా పలు కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. 

రిషి కపూర్‌ ట్విటర్‌లో ఏదో ఒక విషయంలో ఇలా ఇరకాటంలో పడటంపై రణ్‌బీర్‌ కపూర్‌ ఇటీవలే స్పందించారు. చాలా సార్లు ఆయన ఏదో ఒక ట్వీట్‌ చేసి, ఇరకాటంలో పడుతూ ఉంటారు. ఆ సమయంలో అ‍మ్మ కాల్స్‌ లేదా మెసేజ్‌లు చేస్తోంది. ‘చూడు ఆయనేం చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత అమ్మ, నాన్నకు క్లాస్‌ పీకుతుంది. కానీ ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఏ విషయాన్ని ఆయన సెన్సార్‌గా ఉంచరు. ఏదైనా చెప్పాలనుకుంటే, వెంటనే చెప్పేస్తారు. పబ్లిసిటీ కోసమే లేదా ఏదైనా ఆయనపై ప్రభావం చూపుతుందో అని ఏమీ చేయరు. ఏదైనా విషయంపై ఫీల్‌ అయితే, వెంటనే దానిని రాసేస్తారు’ అంటూ తండ్రి గురించి రణ్‌బీర్‌ చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top