మనతో మనమే ఫైట్‌ చేయాలి | Rashi Khanna says We have to fight with ourselves | Sakshi
Sakshi News home page

మనతో మనమే ఫైట్‌ చేయాలి

Dec 30 2019 6:52 AM | Updated on Dec 30 2019 6:52 AM

Rashi Khanna says We have to fight with ourselves - Sakshi

‘‘ప్రతిరోజూ ఇంకాస్త మంచి మనిషిగా మారడానికి ప్రయత్నిస్తుండాలి. నిన్నటి కంటే మెరుగ్గా ఉండటానికి కష్టపడుతుండాలి. దానికోసం మనతో మనమే ఫైట్‌ చేస్తుండాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. నటి అయ్యాక ఈ ఏడేళ్లలో నటిగా, వ్యక్తిగా మీలో గమనించిన మార్పేంటి? అని రాశీని అడగ్గా– ‘‘ఈ ప్రయాణంలో చాలా మార్పు గమనించాను. రకరకాల పాత్రలు పోషించడం నా ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపింది. నా ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ఏ విషయాన్నీ ముందే జడ్జ్‌ చేయడం లేదు. గతంలో వెంటనే రియాక్ట్‌ అవ్వడం, టక్కున కోపం రావడం జరిగేవి. ఇప్పుడు తగ్గింది. చాలా శాంతమయ్యాను. ప్రస్తుతం నేను పాటించేది నిన్నటికంటే బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement