‘యన్‌.టి.ఆర్‌’లో రానా లుక్‌ | Rana Look In NTR Biopic | Sakshi
Sakshi News home page

Sep 12 2018 3:46 PM | Updated on Sep 12 2018 6:33 PM

Rana Look In NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో స్వయంగా నిర్మిస్తున్న సినిమా యన్‌టీఆర్‌. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రానా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యన్‌టీఆర్‌లో రానా లుక్‌ను రివీల్‌ చేశారు.

ఇప్పటికే షూటింగ్ సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండగా వినాయక చవితి సందర్భంగా అఫీషియల్‌ గా రానా లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఎన్బీకే ఫిలింస్‌, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement