గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ | Ram Pothineni and Puri Jagannadh iSmart Shankar Goa Schedule Completed | Sakshi
Sakshi News home page

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

Mar 27 2019 3:53 PM | Updated on Jul 14 2019 10:21 AM

Ram Pothineni and Puri Jagannadh iSmart Shankar Goa Schedule Completed - Sakshi

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయ్యింది. నెల రోజులుగా గోవాలో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ప్రధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను, యాక్షన్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరో రామ్‌ను స‌రికొత్త కోణంలో చూపించ‌బోతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ నిర్మాత‌లుగా రూపొందిస్తున్న ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement