తెరపైకి ఆర్జీవీ ‘సంజు’ | Ram Gopal Varma Want to Make Real Biopic On Sanjay Dutt | Sakshi
Sakshi News home page

తెరపైకి ఆర్జీవీ ‘సంజు’

Jul 20 2018 11:50 AM | Updated on Jul 20 2018 2:12 PM

Ram Gopal Varma Want to Make Real Biopic On Sanjay Dutt - Sakshi

ముంబై : సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’  సినిమా ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజుగా నటించిన రణ్‌బీర్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం ద​క్కాయి. ప్రస్తుతం సంజు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అదే పేరుతో (సంజు : ది రియల్‌ స్టోరీ) సంజయ్‌ దత్‌ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

హిరాణీ ‘సంజు’  సినిమాలో సంజయ్‌ దత్‌ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆర్జీవీ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... సంజయ్‌ దత్‌ నిజమైన బయోపిక్‌ను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. ‘హిరాణీ సంజు నచ్చింది. కానీ నా సినిమాలో రెండు దశాబ్దాలుగా సంజయ్‌ను వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రధానంగా చర్చించబోతున్నానంటూ’  పరోక్షంగా ముంబై పేలుళ్ల కేసు గురించి వ్యాఖ్యానించారు.

సంజయ్‌ వద్దకు ఏకే- 56 రైఫిల్‌ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి నా సినిమాలో చూస్తారంటూ ఆర్జీవీ హింట్‌ ఇచ్చారు. ఇందుకోసం సంజయ్‌ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులను, కొంత మంది పోలీసు, విచారణ అధికారులను సంప్రదిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement