
హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మొదలుపెట్టిన ఈ చాలెంజ్ టాలీవుడ్‌కు చేరింది. మోహన్‌లాల్ వర్కౌట్లు చేస్తూ వీడియోను పోస్ట్ చేస్తు ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరారు. అఖిల్ , నాగార్జునకు, నాగచైతన్యకూ చాలెంజ్ విసిరారు. చైతు యాక్సెప్ట్ చేసి సమంతకు విసిరారు. అలాగే నాగార్జున కూడా యాక్సెప్ట్ చేసి నానికి సవాలు విసిరారు. ఇలా గొలుసుకట్టులా ఈ చాలెంజ్ టాలీవుడ్ మొత్తం పాకుతోంది.
తాజాగా ఎన్టీఆర్ విసిరిన సవాలుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ యాక్సెప్ట్ చేశారు. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి, కేటీఆర్‌కు, వరుణ్ తేజ్‌కు, సుకుమార్‌కు సవాల్ విసిరారు. మరి వీరంతా సవాల్‌ను ఎప్పుడు స్వీకరిస్తారో , మళ్లీ ఎవరికి సవాళ్లు విసురుతారో వేచి చూడాలి.
Mega Power Star #RamCharan accepts Young Tiger @tarak9999's Fitness Challenge and he challenges #Megastar, @KTRTRS, @IAmVarunTej, @aryasukku #HumFitToIndiaFit pic.twitter.com/FXLi7BNapZ
— BARaju (@baraju_SuperHit) June 5, 2018