బాహుబలి సక్సెస్ కంటే కూడా..! | Raju Mahalingam About Rajamouli | Sakshi
Sakshi News home page

బాహుబలి సక్సెస్ కంటే కూడా..!

Jul 8 2017 3:43 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి సక్సెస్ కంటే కూడా..! - Sakshi

బాహుబలి సక్సెస్ కంటే కూడా..!

బాహుబలి దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తన వినయ విధేయతలతో

బాహుబలి దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తన వినయ విధేయతలతో అంతకన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. దేశంలోనే ఘనవిజయం సాధించిన సినిమాకు దర్శకుడైనా.. రాజమౌళి ఎప్పుడు ఆ గర్వాన్ని చూపించరు. తనను కలిసిన సినీ ప్రముఖలతో సవినయంగా వ్యవహరించటం రాజమౌళికి అలవాటు.

ఇదే విషయాన్ని తాజాగా ఓ తమిళ సినిమా ప్రముఖుడు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న 2.0 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం. ఇటీవల రాజమౌళిని కలిసిన మహాలింగం ఆసక్తికర ట్వీట్ చేశాడు. బాహుబలి సక్సెస్ కన్నా.. రాజమౌళి చూపించిన వినయమే గొప్పగా అనిపించింది అంటూ ట్వీట్ చేశాడు రాజు మహాలింగం.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 2.0 ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో పొస్ట్ ప్రొడక్షన్  వర్క్ కోసం ఆరు నెలలకు పైగా సమయం కేటాయించారు. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న 2.0 సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement