టామీతో అనుబంధం | rajendra prasad tommy movie july 20th shooting completed | Sakshi
Sakshi News home page

టామీతో అనుబంధం

Jul 14 2014 12:29 AM | Updated on Sep 2 2017 10:15 AM

టామీతో అనుబంధం

టామీతో అనుబంధం

కుక్కకూ, యజమానికీ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘టామీ’. ఇందులో యజమానిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. కుక్క చేసే

కుక్కకూ, యజమానికీ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘టామీ’. ఇందులో యజమానిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. కుక్క చేసే విన్యాసాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు రాజా వన్నెంరెడ్డి చెబుతున్నారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని, నరసాపురం రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల పాటు చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించామని రాజా వన్నెంరెడ్డి తెలిపారు.
 
 నిర్మాత హరిరామజోగయ్య మాట్లాడుతూ- ‘‘1925-37 మధ్యకాలంలో జీవించిన ఓ పెంపుడు శునకం యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 20 నాటికి షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. సీత, సురేశ్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, వేణుమాధవ్, ముంతాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: రాజేంద్రకుమార్, కెమెరా: మోహన్, సంగీతం: చక్రి, పాటలు: అనంతశ్రీరామ్.
 

Advertisement
 
Advertisement
Advertisement