నేసమణి టీషర్టులకు గిరాకీ

Pray For Nesamani Goes Viral And Demand For Nesamani Tshirts - Sakshi

పెరంబూరు:  ఎంత పని చేశావయ్యా వడివేలు అని ప్రజలు అనుకంటున్నారు. నేసమణి పాత్రలో హస్య నటుడు వడివేలు ఫ్రెండ్స్‌ చిత్రంలో చేసిన వినోదాన్ని ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. విజయ్, సూర్య కలిసి నటించిన ఆ చిత్రంలో కాంట్రాక్టర్‌ నేసమణి పాత్రను పోషించిన వడివేలు నెత్తిపై నటుడు రమేశ్‌ఖన్నా సుత్తి పడేస్తాడు. దీంతో చచ్చానురా దేవుడో అంటూ వడివేలు పడిపోతాడు. కాగా ఫ్రెండ్స్‌ చిత్రం వచ్చి దశకం దాటినా ఈ కామెడీ సన్నివేశం ఇప్పటికీ పలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీ అవుతూనే ఉంది. ఆ నేసమణి కామెడీ సన్నివేశం దేశవ్యాప్తం అయ్యింది. ఇటీవల ఎన్నికల సమయంలో ఈ నేసమణి పాత్రపై  సామాజిక మాధ్యమాల్లో మిమీస్‌ హల్‌చల్‌ చేశాయి.

ఇప్పుడు ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ అంటూ పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పత్రి అంశంపైనా మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. కాగా వడివేలు పోషించిన నేసమణి పాత్ర ట్రెండీ అవడమే కాదు వ్యాపారంగా మారిపోయ్యింది. అవును నేసమణి తలపై సుత్తి పడేలా ప్రింటుతో తిరుపూర్‌ టీషర్టులు మార్కెట్‌లోకి వచ్చి హాట్‌కేక్‌లా అమ్ముడు పోతున్నాయి. విశేషం ఏమిటంటే ఈ టీషర్టులకు స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఏర్పడిందట. ఈ టీషర్టులను  తిరుపూర్‌కు చెందిన ఆన్‌లైన్‌ వస్త వ్యాపారస్తుడు విమల్‌ తమారు చేస్తున్నాడు. నేసమణి పేరుతో టీషర్టులను తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందన్న విషయం గురించి అతను తెలుపుతూ గత మూడు రోజులు గా పేస్‌బుక్,ఇంటర్నెట్, యూట్యూబ్‌ వంటి సా మాజిక మాధ్యమాల్లో  నటడు వడివేలు నటించిన  సేసమణి పాత్ర గురించే ట్రెండీ అవుతుండటంతో ఆ పాత్ర పేరుతో టీషర్టులు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. అంతే కాటన్, పాలిస్టర్‌ క్లాత్‌లతో టీషర్టులను తయారు చేసి ఆన్‌లైన్‌లో పెట్టగా దేశ, విదేశాల నుంచి విపరీతంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top