జాన్‌ నుంచి జాన్‌ | Pooja Hegde to romance a Lean Prabhas | Sakshi
Sakshi News home page

జాన్‌ నుంచి జాన్‌

Dec 21 2019 2:04 AM | Updated on Dec 21 2019 4:35 AM

Pooja Hegde to romance a Lean Prabhas - Sakshi

ప్రభాస్

‘సాహో’ రిలీజ్‌ తర్వాత బ్రేక్‌లో ఉన్నారు ప్రభాస్‌. జనవరి నుంచి మళ్లీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ‘సాహో’ చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు.

‘సాహో’ రిలీజ్‌ అప్పుడు ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ సంక్రాంతి పండగ తర్వాత తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. సో.. జాన్‌ (జనవరి) నుంచి ‘జాన్‌’తో ప్రభాస్‌ బిజీగా ఉంటారు. ఈ సినిమాకు సంబంధించిన ఆరు సెట్లను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ పురాతన వాహనాల దొంగ పాత్రలో కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు అమితి త్రివేది సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement