చెర్రీకి రాఖీ కట్టిన చిట్టి చెల్లి | Pawan's Daughter Ties Rakhi To Charan | Sakshi
Sakshi News home page

చెర్రీకి రాఖీ కట్టిన చిట్టి చెల్లి

Aug 24 2016 3:47 PM | Updated on Mar 22 2019 5:33 PM

చెర్రీకి రాఖీ కట్టిన చిట్టి చెల్లి - Sakshi

చెర్రీకి రాఖీ కట్టిన చిట్టి చెల్లి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. తన పెద్దన్నయ్య రామ్ చరణ్తో రాఖీ పండుగ జరుపుకున్న ఓ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. తన పెద్దన్నయ్య రామ్ చరణ్తో రాఖీ పండుగ జరుపుకున్న ఓ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది. పవన్ కూతురు తనకు రాఖీ కడుతున్న ఫొటోను స్వయంగా రామ్ చరణే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా దగ్గరుండి పాప చేత చెర్రీకి రాఖీ కట్టించారు. ఈ ఫొటో పవన్ ఫ్యాన్స్ని ఖుషీ చేస్తుంది.

చిట్టి చెల్లికి చెర్రీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. కుటుంబంలో జరిగే వేడుకలకు పవన్ తరఫున ఆయన సతీమణి అన్నా హాజరవుతున్నారు. శ్రీజ వివాహ వేడుకలో సందడి చేసిన ఆమె, తాజాగా మెగాస్టార్ బర్త్ డే పార్టీలో కూడా మెరిశారు. మెగా ఫంక్షన్లకు హాజరు కాకపోయినా అన్నయ్య కుటుంబంతో తమ్ముడు సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడని స్పష్టం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement