పవన్ కల్యాణ్ రిటైర్మెంట్? | Pawan Kalyan to Announce Retirement soon | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ రిటైర్మెంట్?

Feb 26 2016 4:44 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ రిటైర్మెంట్? - Sakshi

పవన్ కల్యాణ్ రిటైర్మెంట్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? పూర్తిస్థాయి రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? పూర్తిస్థాయి రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారా? ప్రస్తుతం ఇదే వార్త సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మరో నాలుగైదు సినిమాల అనంతరం పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని టాక్.

రాజకీయాల్లో పూర్తి స్థాయి క్రియాశీలక పాత్ర పోషించేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ స్థాపించిన 'జనసేన' పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారట. సినిమాల్లో నటించడంతోపాటు.. నిర్మాణ రంగంలో కూడా భాగస్వామ్యం వహించి రాబోయే రెండు,మూడేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలను సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారట.

2018 సంక్రాంతికి పవన్ నటించే ఆఖరి సినిమా తెర మీదకొస్తుందని, ఇక ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి 2019 ఎన్నికలకు సంబంధించి పవన్ బిజీ అవుతారని వినికిడి. ఏదేమైనా పవర్ స్టార్ అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త. కాగా ప్రస్తుతం సెట్స్ మీదున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్'  సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement