విజయవాడ: కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ షాకిచ్చారు. కూటమి అభ్యర్థులకు పోటీగా తన వర్గంతో నామినేషన్ల వేయించారు కొలికపూడి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్థానం ఒప్పందంలో భాగంగా జనసేనకు కేటాయించారు. దీనిలో భాగంగా జనసేన తరఫున పసుపులేటి మాధవి నామినేషన్ వేశారు. అయితే ఆమెకు పోటీగా పెనమల్లి శ్రావణితో నామినేషన్ వేయించారు కొలికపూడి.


తన వర్గం కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థులతో కొలికపూడి ర్యాలీ నిర్వహించారు. 28 వార్డులకు తన వర్గంతో కొలికపూడి నామినేషన్లు వేయించడం కూటమిలో అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేసింది.
బీజేపీ అభ్యర్థిపై టీడీపీ మూకల దాడి
వైఎస్సార్జిల్లాలో బీజేపీ అభ్యర్థి కొటికె వెంకటరమణపై టీడీపీ మూకలు దాడికి దిగాయి. చివరి నిమిషంలో 6వ డివిజన్కు నామినేషన్ వేసేందుకు వచ్చిన వెంకటరమణపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. తమకు తెలియకుండా నామినేషన్ వేస్తావా అంటూ బీజేపీ అభ్యర్థిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొకవైపు వెంకటరమణకు మద్దతుగా వచ్చిన రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు పణతల సురేష్.. టీడీపీ మూకల దాడితో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
ఇదీ చదవండి: జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచి..


