కాకినాడ: పిఠాపురం కూటమిలో రాజకీయ కుంపటి రాజుకుంది. జనసేన తీరుపై టీడీపీ కార్పొరేటర్లు భగ్గుమన్నారు. సీట్ల కేటాయింపులపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 వార్డుల్లో కూటమి రెబల్స్గా నామినేషన్లు దాఖలు చేశారు. అధిష్ఠానం తీరుపై టీడీపీ నాయకులు తిరుగుబావుట ఎగరవేశారు. సీట్ల కేటాయింపులో జనసేన నాయకులు తమను సంప్రదించలేదని టీడీపీ మాజీ కౌనల్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. ఛైర్మన్ అభ్యర్థిగా 22వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ వల్లూరి జమాయి దేవ కుమారి బరిలోకి దిగారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇటు నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలోనూ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
ఇదీ చదవండి: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు


