అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోగా లోపల ఉన్న వారందరూ మాత్రం నామినేషన్లు వేయొచ్చు. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చారు. మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. సోమవారం స్క్రూటినీ ఉంటుంది. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్ ఉంటుంది.
మూడు రోజులుగా టీడీపీ గూండాల అరాచకం
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడు రోజులుగా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డకున్నారు. ఉమ్మడి కడప జిల్లాను రక్తసిక్త చేసింది పచ్చముఠా. టీడీపీ గూండాల దాడి, కత్తిపోట్లతో వైఎస్సార్సీపీ నేతలకు గాయాలయ్యాయి. ఈ దాడులతో పాటు పులివెందులలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అనేక చోట్ల నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
పులివెందులలో 16 వార్డుల్లో, ప్రొద్దుటూరులో 19, కడపలో 54 వార్డులలో నామినేషన్లను అడ్డుకున్నారు. యర్రగుంట్ల, కమలాపురం, రాయచోటిలో చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు పడకుండా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు.
రాజంపేట, బద్వేలులో చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, రాజంపేట, బద్వేలులో వార్డులకు నామినేషన్లు పడలేదు. దర్శిలో చైర్మన్ సహా 25 వార్డులకు నామినేషన్లు పడలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 4 వార్డుల్లో నామినేషన్లను టీడీపీ గూండాలు తమ అరాచకంతో అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: దసరా పోస్టర్.. రావణుడి పది ముఖాల్లో ఒకటిగా ఎలాన్ మస్క్


