సాక్షి, కడప: పులివెందులలో ఘర్షణలకు ప్రధాన కారణం పోలీసులు, ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి.. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో ఈ రోజు (ఆదివారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు వైసీపీ నేతలు నామినేషన్ల వేయడం తప్పా? అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు మార్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్లు వేయడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు బయిలుదేరితే యుద్ధాలు చేయాల్సి వచ్చింది అని అన్నారు.
అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఉందో లేదో అర్థం కావడం లేదని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుులు SECకి ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో కూటమి అరాచకాలను ఎస్ఈసీకి పంపించామని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు


