ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు! | We Have Appealed To SEC To Protect Democracy: YS Jagan | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!

Oct 18 2026 2:16 PM | Updated on Oct 18 2026 2:38 PM

We Have Appealed To SEC To Protect Democracy: YS Jagan

సాక్షి, విజయవాడ: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఈసీని కలిసిన వైఎస్‌ జగన్‌.. టీడీపీ అరాచకాలు, హింసపై ఫిర్యాదు చేశారు. టీడీపీ దాడులపై ఆధారాలతో సహా వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని కోరామని తెలిపారు.

‘‘నామినేషన్‌ వేయకుండా  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే ఎస్‌ఈసీ  ఏం చేస్తోందని అడిగాం’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. నామినేషన్‌ ప్రక్రియలోనే పోలీసులు, అధికారులు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

‘‘నామినేషన్‌ కేంద్రాల దగ్గరే పత్రాలు చించేస్తున్నారు. పారా మిలటరీ దళాలను దించాలని ఎస్‌ఈసీని కోరాం. కేంద్ర బలగాలను దించాలని గవర్నర్‌నూ కోరాతాం. స్ట్రాంగ్‌ రూమ్స్‌లో బ్యాలెట్‌ బాక్సులు మారుస్తారని అనుమానం. స్ట్రాంగ్‌ రూమ్స్‌లోనే కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. కౌంటింగ్‌ హాల్‌లో కూడా సీసీ కెమెరాల నిఘా ఉండాలి. 17cలో ఫోర్జరీ సంతకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఈసీ నియామకంపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement