సాక్షి, తాడేపల్లి: సీఈసీ నియామకంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీజేఐ నేతృత్వంలో సీఈసీ నియామకం జరగాలని.. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లో సంస్కరణలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని వ్యవస్థల్లో మార్పురావాలి.. రాష్ట్రంలోనూ ఎస్ఈసీ నియామక విధానంలో మార్పు రావాలన్నారు.
’’ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నాడు చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీ. సీఎస్గా అనిల్ చంద్ర పునేఠా విధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల నుంచి తొలగించింది. అలాంటి అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ చేసినా.. చంద్రబాబు ఆయన్ను ఇప్పుడు ఎస్ఈసీగా తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబుకు వీరవిధేయుడు. చంద్రబాబు ఏం చెబితే పునేఠా అది చేస్తున్నారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: పార్టనర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్



