పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్‌ జగన్‌ | YS Jagan Comments On Chandrababu And Police | Sakshi
Sakshi News home page

పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్‌ జగన్‌

Oct 18 2026 12:12 PM | Updated on Oct 18 2026 12:43 PM

YS Jagan Comments On Chandrababu And Police

సాక్షి, తాడేపల్లి: ‘సర్‌’ తుది జాబితా కాకుండా జాబితా ద్వారానే ఎన్నికలు.. చెల్లని ఓట్ల ద్వారా ఎన్నికలకు సిద్ధమయ్యారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇష్టానుసారంగా డివిజన్లు, వార్డులను విభజించారు. రిజర్వేషన్లు వారికి  కావాల్సిన  చోట ఇచ్చుకున్నారు. క్యాస్ట్‌, నో డ్యూస్‌ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలను బైండోవర్‌ పేరుతో పోలీసులు బెదిరించారు. ఇన్ని దారుణాలు చేసికూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లలేకపోయారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

‘‘పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థులను సప్లై చేస్తూ.. నారాసుర రక్త చరిత్ర రాస్తూ.. చంద్రబాబు స్టేట్‌ స్పాన్సర్డ్‌ హింసకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక మాఫియా రాజ్యం నడుపుతున్నారు. నామినేషన్‌ సెంటర్లలో టీడీపీ గూండాలను పోలీసులు పట్టించుకోరు. మారణాయుధాలతో టీడీపీ గూండాలు తిరుగుతున్నా పట్టించుకోరు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నలుగురితో వెళ్లినా అడ్డుకుంటున్నారు

ఆర్వోలే నామినేషన్‌ పత్రాలు తీసుకోవడంలేదు. రాష్ట్ర డీజీపీ, హోం, సెక్రటరీ నిద్రపోతున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం ఉన్నట్టా? లేనట్టా?. మా హయాంలో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ పనిచేశారు. నిమ్మగడ్డ రమేష్‌.. టీడీపీకి అత్యంత సన్నిహితుడు. నిమ్మగడ్డ రమేష్‌ ఆధ్వర్యంలో మేం ఎన్నికలకు వెళ్లా. నిమ్మగడ్డ ఎంతో మంది అధికారులను ట్రాన్స్‌ ఫర్‌ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికలను క్లీన్‌ స్వీప్‌ చేశాం’’ అని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement