విజయవాడ: కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వ్యవస్థలు ఇలా తయారైనప్పుడే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైఎస్ జగన్ కూటమి తీరుపై ఫిర్యాదు చేశారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు. నామినేషన్ల వ్యవస్థను ఆన్లైన్ లేదా సెంట్రలైజ్ చేయాలని అడిగాం. పారామిలిటరీ దళాలను దించాలని కోరాం. పోలింగ్ బూత్‌లు, కౌంటింగ్ కేంద్రాలు పెట్టాలని అడిగాం. స్ట్రాంగ్ రూమ్‌ల్లో కూడా సీసీ కెమెరాలను పెట్టాలని కోరాం.
కూటమిని ప్రజలు, దేవుడు.. సింగిల్ డిజిట్‌తో కొడతారు. మన కార్యకర్తలు గట్టిగా నిలబడండి. మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. కార్యకర్తలకు నేను ఒకటే చెబుతున్నాను. వాళ్లు కొడతారు.. కొట్టించుకుందాం.. ఎల్లకాలం కూటమి పాలన ఉండదు’’ అని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం దిగజారుతోందని, రాష్ట్రంలో పరిస్థితలుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. కార్యకర్తలు గట్టిగా నిలబడాలని సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు: వైఎస్ జగన్


