తాడేపల్లి : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ గూండాలు స్పష్టించిన అరాచకాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు మరి కాసేపట్లో గవర్నర్తో సమావేశం కానున్నారు. మూడు రోజులుగా టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలపై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎస్ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్.. ఇదే అంశాన్ని గవర్నర్కు సైతం వివరించనున్నారు.
కాగా, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మూడు రోజులుగా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డకున్నారు. ఉమ్మడి కడప జిల్లాను రక్తసిక్త చేసింది పచ్చముఠా. టీడీపీ గూండాల దాడి, కత్తిపోట్లతో వైఎస్సార్సీపీ నేతలకు గాయాలయ్యాయి. ఈ దాడులతో పాటు పులివెందులలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అనేక చోట్ల నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
పులివెందులలో 16 వార్డుల్లో, ప్రొద్దుటూరులో 19, కడపలో 54 వార్డులలో నామినేషన్లను అడ్డుకున్నారు. యర్రగుంట్ల, కమలాపురం, రాయచోటిలో చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు పడకుండా టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు.
రాజంపేట, బద్వేలులో చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, రాజంపేట, బద్వేలులో వార్డులకు నామినేషన్లు పడలేదు. దర్శిలో చైర్మన్ సహా 25 వార్డులకు నామినేషన్లు పడలేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 4 వార్డుల్లో నామినేషన్లను టీడీపీ గూండాలు తమ అరాచకంతో అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!


